![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -357 లో.. మీరు ఇలా మా కూతురిని కలిసి మాట్లాడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారని కనకం-కృష్ణమూర్తి కలిసి కళ్యాణ్ తో అంటారు. మమ్మల్ని ఎవరు అన్నారో చెప్పేవరకు ఇక్కడ నుండి వెళ్ళనని కళ్యాణ్ అనగానే.. కళ్యాణ్ భార్య,కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి వచ్చి తిట్టిన విషయం కనకం చెప్తుంది. దాంతో కళ్యాణ్ కోపంగా అక్కడ నుండి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ కావ్య అక్కని వాళ్ళెన్ని మాటలు అంటున్నారోనని అప్పు అంటుంది.
ఆ తర్వాత ధాన్యలక్ష్మి, అనామికలు కోపంగా ఇంటికి వెళ్తారు. కావ్య అంటు ధాన్యలక్ష్మి పిలిచి.. నా కొడుకు, కోడలిని సవ్యంగా కాపురం చేసుకోనివ్వవా అనగానే అందరు షాక్ అవుతారు. బయటకు వెళ్లి మీ మెదడు పాడుచేసుకొని వచ్చారా.. ఎందుకిలా మాట్లాడుతున్నారని స్వప్న అంటుంది. నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్ ఇందులో నీ హస్తం కూడా ఉందా అని స్వప్నని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారని కావ్య అంటుంది. నా కొడుకుని ఆఫీస్ కి రాకుండా ఇంట్లోనే కవితలు రాసుకుంటూ ఉండంటూ చెప్పింది నువ్వేనని ధాన్యలక్ష్మి అనగానే.. వాడికి ఆఫీస్ కి రావడం ఇష్టం లేదని వాడే చెప్పాడు కదా చెప్తే వినడానికి వాడేం చిన్నపిల్లాడు కాదని రాజ్ అంటాడు.. నీకు ఇలా రోజుకి ఒక గొడవ చెయ్యడం బాగా అలవాటు అయిందంటూ అపర్ణ తిడుతుంది. అసలు ఈ కావ్యే కళ్యాణ్ కి అప్పుని దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు అప్పుని కళ్యాణ్ కలిసాడని ధాన్యలక్ష్మి చెప్పగానే.. అప్పుకి ఏనాడో చెప్పాను మర్చిపోమ్మని ఈ రోజు ఎవరు ఎవరిని కలిసారో నాకెలా తెలుస్తుందని కావ్య అంటుంది.
ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి అనామిక, ధటన్యలక్ష్మిలని తిడతాడు. అసలు మీరేం చేస్తున్నారు.. మీరు కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్లి గొడవ చేశారు.. అది చాలదన్నట్లు ఇక్కడ గొడవ చేస్తున్నారా.. ఏన్నడూ లేని విధంగా అనామిక, ధాన్యలక్ష్మిలని కళ్యాణ్ తిడతాడు. అప్పుని పెళ్లి చేసుకోవాలని అనుకంటే నన్ను ఆపే వాళ్ళు ఎవరు? నీ మాయలో పడిపోయాను కాబట్టి అప్పు ప్రేమని గుర్తించలేదు. ఇంకొకసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదంటూ ఇద్దరికి కళ్యాణ్ వార్నింగ్ ఇస్తాడు. మంచిగా బుద్ధి చెప్పావని ఇందిరాదేవి అంటుంది. నువ్వు అప్పుని కలిసి వాళ్ళని మీ వాళ్ళు తిట్టేలా చేస్తున్నావని కావ్య అనగానే.. మీరు నన్ను అంటున్నారా అని కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |